అర్జీలు పునరావృతం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతం కావొద్దు

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

● కలెక్టర్‌ కె. హైమావతి

● వచ్చిన అర్జీలు 103

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణిలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను వేగంగా పరిష్కరించి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో అర్జీలు అందిస్తారని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుదర్శన్‌రెడ్డి, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ భవ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి వృథాపై అవగాహన కల్పించాలి

ప్రజావాణి కార్యక్రమానికి ముందు వేసవిలో ఇంటింటికీ తాగునీరు అందించే కార్యాచరణపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవంబర్‌ మొదటి, రెండవ వారాల్లో వేసవిలో తాగునీరు అందించే ప్రక్రియపై స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో మిషన్‌ భగీరథలో చేసిన పనులు ట్యాంకులు శుభ్రం చేయడం, లీకేజీలు లేకుండా చూడడం, రికార్డుల నిర్వహణ, తాగునీరు వృథా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం శాఖల వారీగా ప్రజావాణి పెండింగ్‌ దరఖాస్తుల వివరాలు, పరిష్కారం వంటివాటిపై ఆరా తీశారు. మండలాల వారీగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో దరఖాస్తులు సైతం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు

న్యాయం చేయండి

జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ రైతు స్వరాజ్య వేధిక ఆధ్వర్యంలో సోమవారం బాధిత కుటుంబాలతో కలసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటున్నాయన్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ వంటి కనీస అవసరాలను తీర్చువడం కష్టంగా మారిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు బాధిత కుటుంబాలను సంప్రదించి క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement