పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
కొండపాక(గజ్వేల్): చదువుకు పేదరికం, అనాథ అన్న సమస్యలు ఎంత మాత్రం అడ్డుకావని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పేర్కొ న్నారు. మండల కేంద్రం శివారులో గల నిశాంత్ బాలసదనం అనాథాశ్రమంలో సీపీ విద్యార్థులతో కలిసి దీపావళీ పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా నోట్ బుక్కులు, పెన్నులు తదితర సామగ్రితో పాటు మిఠాయిలు పంచి టపాసులు పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం బాలసదనం భవనం శిథిలావస్థలోకి చేరుకోవడంతో వర్షాకాలంలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇన్‌చార్జి రమాదేవి సీపీ దృష్టికి తీసుకెళ్లా రు. భవనం మరమ్మతులతోపాటు ఇతర సమస్యలున్నా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. విద్యార్థు ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. పిల్లల బాగు కోసం దాతలు సహాయ సహకారాలు అందించాలన్నారు. అంతకు ముందు అష్టాదశ శక్తి పీఠం ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సీపీ కార్యాలయ స్పెషల్ బ్రాంచ్ సీఐ లతీఫ్, సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలకృష్ణ, బాలసదనం వార్డెన్ వెంకటేశ్, పోలీసులు పాల్గొన్నారు.


