సారూ.. మీరే రావాలి | - | Sakshi
Sakshi News home page

సారూ.. మీరే రావాలి

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

సారూ.. మీరే రావాలి నల్లవాగు కాల్వల పరిశీలన రైతులను ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వ భూములు కాపాడండి

హత్నూర(సంగారెడ్డి): మండలంలోని మధుర గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఉదయ్‌ కిరణ్‌, నర్సింహులు పాదయాత్రగా ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నాచారం లక్ష్మీనరసింహ స్వామి ప్రసాదాన్ని అందించారు. మరోసారి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని, రైతుల సమస్యలు తీరుతాయని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు కేసీఆర్‌కు వివరించారు. ఆయన వారిని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నవీన్‌గౌడ్‌, ఉదయ్‌ కిరణ్‌, రాజీవ్‌ గాంధీ, నర్సింహ, శ్రీకాంత్‌, ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్హేర్‌(నారాయణఖేడ్‌): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కాల్వలను సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి సోమవారం పరిశీలించారు. మండలంలోని బీబీపేట్‌ వద్ద డీ–4 కెనాల్‌ను పర్యవేక్షించారు. ఇటీవల సాగు నీరు అందించేందుకు కాల్వల్లో పూడికతీత పనులు చేశారా? అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో మాట్లడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టీ సీఐ వెంకట్‌రెడ్డి, ఏఈ మల్లేశం, కాంగ్రెస్‌ నాయకులు బండారి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

హత్నూర (సంగారెడ్డి): ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం మండలంలోని గుండ్లమాచునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటికే రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని తెలిపారు. కొనుగోళ్లు త్వరగా చేయకపోతే కర్షకులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీహరి, ఉపసర్పంచ్‌ శంకర్‌, ఏపీఎం రాజశేఖర్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు కృష్ణ, ఇబ్రహీం, వీరేందర్‌, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటిని కాపాడాలని ఎంపీ రఘునందన్‌రావు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ ను కోరారు. ఈమేరకు సోమవారం నర్సాపూర్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు వినతిపత్రం అందజేశారు. పట్టణానికి చెందిన పలు సర్వే నంబర్లలోని భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వివరించారు. వాటిని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, పలువురు నాయకులు ఉన్నారు. ఇదే విషయమై పలువు రు కాంగ్రెస్‌ నాయకులు సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే పలువురు తమ తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement