ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో సోమ వారం భక్తుల సందడి నెలకొంది. అమావాస్యను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామునే ఆలయ ఆవరణలోని గుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.


