మానిటరింగ్ చేశాం
ఫార్మాకు తోడు..
జిల్లాలో పలుచోట్ల పడిపోయిన గాలి నాణ్యత సూచి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మా, రసాయన, పైరాలసిస్ వంటి పరిశ్రమల నుంచి నిత్యం వెలుగువడుతున్న హానికరమైన వాయువులు ఒకవైపు.. పటాకుల పొగ మరోవైపు.. జిల్లా వాసుల కాలుష్య కష్టాలు మరింత పెరిగాయి. సాధారణంగా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతోనే జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు పటాకుల పొగతో గాలి నాణ్యత మరింత పడిపోయింది. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జిల్లాలో గాలినాణ్యత భారీగా క్షీణించినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గుర్తించింది. సగటున ఏక్యూఐ (గాలి నాణ్యత సూచి) 148గా నమోదైందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇతర వెబ్‌సైట్లలో ఈ సమయంలో ఏక్యూఐ 300 దాటిందంటే కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా సంగారెడ్డి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, సదాశివపేట, జహీరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలతో పాటు, హత్నూర, కొండాపూర్, కంది వంటి మండలాల్లోని పరిశ్రమలు ఉన్న గ్రామాల్లోనూ వాయు నాణ్యత పడిపోవడం ఇటు గ్రామీణ ప్రాంత వాసులను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది.
పడిపోయిన వాయు నాణ్యత
జిల్లాలో పాశమైలారం పారిశ్రామిక వాడలో సింఫనీ పార్కు, ఐఐటీహెచ్ కంది, ఇక్రిశాట్‌లలో కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించి ఆన్‌లైన్ మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటికి తోడు సంగారెడ్డి, రామచంద్రాపురం (జీహెచ్‌ఎంసీ), పటాన్‌చెరుల్లో మ్యాన్‌వల్‌గా గాలి నాణ్యతను పరిశీలిస్తారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాయు నాణ్యత దారుణంగా పడిపోయినట్లు గుర్తించారు. సింఫనీపార్కులో అత్యధిక సగటున ఏక్యూఐ 148కి నమోదు చేసిందని పీసీబీ ప్రకటించినప్పటికీ.. అత్యధికంగా ఏక్యూఐ 300 దాటినట్లు సమాచారం. పీసీబీ గణాంకాల ప్రకారం 148 ఏక్యూఐ ఉంటే మాడరేట్‌గా పరిగణిస్తామని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ఏక్యూఐ 0 నుంచి 50 లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరంగా భావిస్తారు. 101–150 వరకు మాడరేట్‌గా పేర్కొంటారు. ఏక్యూఐ మాడరేట్‌గా ఉంటే సెన్సిటివ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. 150– 200 ఆరోగ్యవంతుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. 200 దాటితే తీవ్ర ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఈసారి సగటు ఏక్యూఐ 148గా నమోదైందని పీసీబీ అధికారులు చెబుతున్నారంటే వాస్తవానికి గాలి కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దూళితో పాటు సల్ఫర్, నైట్రోస్ ఆకై ్సడ్
గాలిలో దుమ్ము, దూళి అత్యధికంగా ఉన్నట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. అలాగే సల్ఫర్‌కు సంబంధించిన పార్టికల్స్, నైట్రైట్, కార్బన్ సంబంధించిన పార్టికల్స్ గాలిలో కలిసిపోవడంతో నాణ్యత పడిపోవడానికి కారణమని చెబుతున్నారు. వీటి స్థాయి మరింత పెరిగితే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ గాలిని పీల్చితే దీర్ఘకాలంలోనే కాదు, స్వల్పకాలంలోనే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆదివారం రాత్రి అత్యధిక సగటు ‘ఏక్యూఐ 148’
సింఫనీ పార్కులోని పీసీబీ ఆన్‌లైన్ మానిటరింగ్ కేంద్రంలో రికార్డు
ఇతర వెబ్‌సైట్‌లలో అంతకు మించి నమోదు
గాలి కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశాం. జిల్లాలో ఉన్న ఆన్‌లైన్ మానిటరింగ్ కేంద్రాలతో పాటు, మాన్యువల్ స్టేషన్ల ద్వారా నాణ్యతను పరిశీలిస్తున్నాం. మోడరేట్‌గా నమోదైంది. ఆదివారం సగటు అత్యధిక ఏక్యూఐ 148గా నమోదైంది. వాయు, నీటి కాలుష్య నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– విజయలక్ష్మి, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, పీసీబీ, సంగారెడ్డి


