ఏఐ, డేటా సైన్స్‌ అనిశ్చితికి పరిష్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఏఐ, డేటా సైన్స్‌ అనిశ్చితికి పరిష్కారాలు

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ, డేటా సైన్స్‌ రంగాల్లో అనిశ్చితిని పరిష్కరించేందుకు రఫ్‌ సెట్‌ సిద్ధాంతం కీలకమని నిపుణులు పేర్కొన్నారు. మంగళవారం ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ గణిత, గణాంక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఏఐ, డేటా సైన్స్‌ కోసం రఫ్‌ సెట్‌ సిద్ధాంతం’ అంశంపై ఒకరోజు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. రఫ్‌ సెట్‌ సిద్ధాంత వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ జిడ్జిస్లావ్‌ పావ్లాక్‌ శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ప్రొఫెసర్‌ సి.ఆర్‌.రావు, ప్రొఫెసర్‌ సల్మాన్‌ అబ్దుల్‌ మోయిజ్‌, ఎంజీఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ టి.వి.రజనీకాంత్‌ పాల్గొని రఫ్‌ సెట్‌ సిద్ధాంతం గణిత పునాదులు, ఆధునిక అనువర్తనాలపై తమ పరిశోధన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

గీతంలో ఒక రోజు వర్క్‌ షాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement