రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు విద్యార్థులు

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు విద్యార్థులు పేకాటరాయుళ్ల అరెస్టు మద్యం దుకాణాల్లో తనిఖీలు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌ చీడపీడల నివారణకు సాంకేతికత దోహదం

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయి సెపక్‌ తక్రా పోటీలకు గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరీమొద్దీన్‌, పీడీ ప్రశాంత్‌ పేర్కొన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో విద్యార్థులు జీ.కావేరి, జీ. శ్యాంకిశోర్‌, జీ.రాహుల్‌, ఏ.భూలక్ష్మి, జీ.లాస్య, మీనాక్షి ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి 14 వరకు జనగామలో జరిగే 70వ ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కంగ్టి (నారాయణఖేడ్‌): పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ దుర్గారెడ్డి వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడులు చేసి, మంగళవారం 12 మందిని పట్టుకున్నారు. వీరి వద్ద రూ.38,250 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంలోని శ్రీ దత్తసాయి, శ్రీనివాస మద్యం దుకాణాలను మంగళవారం ఎకై ్సజ్‌ శాఖ ఎస్సై విక్రమ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు వారీగా స్టాక్‌ వివరాలను రిజిస్ట్రేషన్‌లో పొందుపరచాలన్నారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఎకై ్సజ్‌ ఎస్‌ఐ షరీఫ్‌, కానిస్టేబుల్‌ బాల్‌రాజు, రజిత, కృష్ణ గౌడ్‌, రవీందర్‌ రెడ్డి, వైన్స్‌ నిర్వాహకులు శ్రీనివాస్‌ గౌడ్‌, శివ, నవీన్‌, మధు, ప్రశాంత్‌, వేణు, శ్రీకాంత్‌, ఉన్నారు.

యజమానిపై కేసు నమోదు

తూప్రాన్‌: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. తూప్రాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగులపల్లి శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు నాగులపల్లి బ్రిడ్జి సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్‌ను ఆపి పరిశీలించగా, మట్టి రవాణాకు సంబంధించి అనుమతి పత్రాలు లేవని తేలింది. దీంతో వాహనాన్ని పోలీసులు వెంటనే సీజ్‌ చేసి స్టేషన్‌న్‌కు తరలించారు. వాహన యజమాని వెంగలి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి

ములుగు(గజ్వేల్‌): ఉద్యాన పంటల్లో చీడపీడలను ముందుగానే గుర్తించి పురుగుల మందులు వినియోగించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌.రాజిరెడ్డి తెలిపారు. చీడపీడల ఉధృతిని ముందస్తుగా అంచనా వేసి రైతులకు శాసీ్త్రయ సలహాలు అందించేందుకు విశ్వవిద్యాలయం, బెంగుళూరుకు చెందిన ఫైల్లో (అగ్రిహాక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) సంస్థతో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఈ సాంకేతిక వ్యవస్థ అమలుతో పురుగుల మందుల అనవసర వినియోగం తగ్గి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement