ఎల్‌నినోతో వానలు రాక బోరుబావుల్లో నీరు లేక , కరెంట్‌ కోతలు సైతం కలవర పెట్టడంతో సాగును వదులుకొని పాల ఉత్పత్తి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పాడి గేదెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా హుస్నాబాద్‌ సంతలో ఒక్కొక్క గేదె ధర రూ.1 | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోతో వానలు రాక బోరుబావుల్లో నీరు లేక , కరెంట్‌ కోతలు సైతం కలవర పెట్టడంతో సాగును వదులుకొని పాల ఉత్పత్తి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. పాడి గేదెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా హుస్నాబాద్‌ సంతలో ఒక్కొక్క గేదె ధర రూ.1

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిత్యం 85 వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసి కరీంనగర్‌, ముల్కనూర్‌ డెయిరీలకు సరఫరా చేస్తున్నారు. రైతులు పాల ఉత్పత్తి వైపు మళ్లితే పాల సేకరణ పెరుగుతుందని డెయిరీ అధికారులు అంచనా వేసి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్‌ మండలాల్లో 16,135 గేదెలు, 16,538 పాడి పశువులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కరువుతో పంటలు ఎండిపోవడంతో రైతులు పశువులను కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసం కొనుగోలు చేయగా గ్రామాల్లో పశుగ్రాసానికి డిమాండ్‌ పెరుగుతుంది. వరి కోతల తర్వాత పశుగ్రాసంను కాల్చివేసే రైతులు ఇప్పుడు పోగుచేసి విక్రయిస్తున్నారు.

పశుగ్రాసానికి సాయం

పశువులను పెంచుకొనే రైతులకు వీబీజీ రామ్‌జీ పథకంలో ఎకరాకు రూ.14వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దాహార్తి తీర్చడానికి ఊరూరా నీటి తొట్లు నిర్మించి పశువులకు తాగునీటి సమస్యలు తీర్చనున్నారు. పశువుల మేతకు లోటు రాకుండా సబ్సిడీపై గడ్డి విత్తనాలను పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. డెయిరీల నుంచి రైతులకు గేదెలు, ఆవుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడానికి ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వం కూడా సబ్సిడీపై పాడి గేదెల కొనుగోలుకు రుణాలు అందిస్తే పాల ఉత్పత్తితో జీవనోపాధి పొందుతామని రైతులు వాపోతున్నారు.

పశుగ్రాసం పెంచుకుంటే ఎకరానికి రూ.14 వేలు

రైతులు పశువుల మేత కోసం పశుగ్రాసం పెంచుకుంటే వీబీజీ రామ్‌జీ పథకంలో ఎకరానికి రూ.14వేల ఆర్థిక సహాయం అందిస్తాం. పశువులకు వేసవిలో దాహార్తిని తీర్చడానికి గ్రామాల్లో నీటి తొట్లు నిర్మిస్తున్నాం. రైతులు ఆయా గ్రామాల్లోని ఫీల్డు అసిస్టెంట్లను సంప్రదించి పశుగ్రాసం కోసం పేర్లు నమోదు చేసుకోవాలి.

– పద్మ, ఏపీఓ, హుస్నాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement