ఇద్దరు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు అదృశ్యం

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

ఇద్దరు అదృశ్యం

పటాన్‌చెరు టౌన్‌: వ్యక్తి అదృశ్యమైన ఘటన ఇస్నాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్‌ వివరాల ప్రకారం.. ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని పెద్ద కంజర్లకు చెందిన దీపక్‌ లోహ్రా (43) ఈ నెల 1న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి అదృశ్యంపై కుమారుడు సేవక్‌ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రావురూకుల గ్రామంలో బాలుడు..

సిద్దిపేటరూరల్‌: బాలుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని రావురూకుల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నవత కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చత్రి రమేశ్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మధు (14) 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల అర్బన్‌ మండలం తడ్కపల్లిలోని విద్యారణ్య ఆవాస విద్యాలయం హాస్టల్‌లో చేర్పించారు. గత నెల 27న హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని పారిపోగా అదేరోజు రాత్రి బస్టాండులో దొరికాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా సోమవారం ఇంటివద్ద ఉన్న తండ్రి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గ్రామంలో, చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement