కంగ్టి (నారాయణఖేడ్): నిద్రించిన చోటే అనుమానాస్పద స్థితిలో వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన మండలంలోని దెగుల్‌వాడీలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ దుర్గారెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూనె జరప్ప (42) రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి ఇంటి ముందు పడుకున్నాడు. అర్ధరాత్రి మంచంతో సహా జరప్ప దగ్ధమై ఉండటం చూసిన అదే గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో ఉండే మృతుడి సోదరుడు రఘునాథ్‌కు సమాచారం అందించాడు. అతడు గ్రామానికి వచ్చి చూడగా జరప్ప నిద్రిస్తున్న స్థలం వద్ద మంచానికి ఉండే తాడు దగ్గర రెండు కరెంటు వైర్లు తెగిపోయి కనిపించింది. దీంతో కరెంటు తీగ తెగిపడడంతో సజీవ దహనం అయ్యాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


