ఆటోను ఢీకొట్టిన హార్వెస్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన హార్వెస్టర్‌

Nov 11 2026 9:34 AM | Updated on Nov 11 2026 9:34 AM

ఆటోను ఢీకొట్టిన హార్వెస్టర్‌

ఐదుగురికి గాయాలు

కొండపాక(గజ్వేల్‌): ఆటోను హార్వెస్టర్‌ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్‌ పరిధిలో కొడకండ్ల గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ నుంచి ఒకే కుటుంబానికి చెందిన సాయిబాబ, సువతి, రాజేశ్వరితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కలిసి ఆటోలో కొమురవెళ్లి మల్లన్న దర్శనం కోసం వస్తున్నారు. ఈ క్రమంలో కొడకండ్ల నుంచి హార్వెస్టర్‌ చిన్ని కిష్టాపూర్‌ వైపునకు వెళ్తూ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో రాజీవ్‌ రహదారిపై రెండు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న సాయిబాబ తలకు గాయాలవ్వగా మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆపకుండా వెళ్తున్న హార్వెస్టర్‌ను స్థానికులు పట్టుకున్నారు. అంబులెన్సులో క్షతగాత్రులను గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై బాలకృష్ణను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement