చిలప్‌చెడ్(నర్సాపూర్): ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని సోమక్కపేట్ గ్రామంలో సర్పంచ్ దుర్గాచలంతో కలిసి డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్న డ్రమ్ములు, టైర్లు, పడేసిన కొబ్బరిబొండాలు, ఖాళీ సీసాలు, పాడైన కూలర్లలో నీరు ఉంటే పారబోయాలన్నారు. తద్వారా దోమలు, సీజనల్ వ్యాధుల భారిన పడకుండా ఉంటారని తెలిపారు. అలాగే మురికి కాలువల్లో బ్లీచింగ్, మురికి గుంటల్లో ఆయిల్‌బాల్స్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్, ఆశావర్కర్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి
నిత్యానంద్గౌడ్


