నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే యువజనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే యువజనోత్సవాలు

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ఏర్పాటు చేశామని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో నిర్వహించిన యువజన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యువత ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతకు సమాన అవకాశాలు కల్పించామని, ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక, జానపద, నృత్యాలు, కవిత, రచన పోటీలు, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం తదితర పోటీలను ఏర్పాటు చేయాలన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వాహణ అధికారి రమేశ్‌, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement