మేకల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మేకల దొంగ అరెస్ట్‌

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

రూ. 20 వేలు స్వాధీనం

రూ. 20 వేలు స్వాధీనం

సిద్దిపేటకమాన్‌: మేకలు, గొర్రెలు దొంగతనానికి పాల్పడుతున్న అంతర్‌ జిల్లా ముఠాలోని ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్‌ ఎస్‌ఐ సైఫ్‌అలీఖాన్‌తో కలిసి సీఐ మురళి కేసు, నిందితుడి వివరాలను గురువారం వెల్లడించారు. సిద్దిపేట పట్టణం నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలో మారబోయిన నర్సింహులు గత నెల 16న ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ మేకను ఎత్తుకెళ్లారు. బాధితుడి కుమారుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట నర్సాపూర్‌ చౌరస్తా వద్ద పోలీసులు గురువారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన గోలెనా కుమార్‌ అలియాస్‌ జికె కుమార్‌ (30) అదుపులోకి తీసుకుని విచారించారు. తన స్నేహితులతో కలిసి మేకలు, గొర్రెలు దొంగిలిస్తున్నట్లు, సిద్దిపేటలో దొంగిలించిన మేకను కరీంనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తికి రూ. 20 వేలకు విక్రయించినట్లు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement