కళాశాలలో షార్ట్‌ సర్క్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

కళాశాలలో షార్ట్‌ సర్క్యూట్‌

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

● కమ్ముకున్న పొగలు ● భయంతో విద్యార్థుల పరుగులు

● కమ్ముకున్న పొగలు ● భయంతో విద్యార్థుల పరుగులు

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలోని నైన్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో సోమవారం ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు రావడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా.. సూడా కార్యాలయం సమీపంలో ఉన్న నైన్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల భవనం సెల్లార్‌లో ఉన్న మీటర్‌, డీపీ బాక్స్‌లో ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు వచ్చాయి. దీంతో కళాశాలలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. మరోవైపు తరగతి గదుల్లోకి పొగలు రావడంతో విద్యార్థులు పరుగులు తీశారు. సకాలంలో సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో సిబ్బంది, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్‌ భద్రతా చర్యల వైఫల్యం వల్లే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement