సెల్‌ఫోన్‌ పవర్‌బ్యాంకు పేలి | - | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ పవర్‌బ్యాంకు పేలి

Aug 26 2026 7:25 AM | Updated on Aug 26 2026 7:25 AM

విద్యార్థికి తీవ్ర గాయాలు

విద్యార్థికి తీవ్ర గాయాలు

జహీరాబాద్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థి రాకేష్‌ తన జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ పవర్‌బ్యాంకు పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలిలా ఉన్నాయి. కోహీర్‌ మండలంలోని కొత్తూర్‌(డి) గ్రామానికి చెందిన రాకేశ్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం మూత్రం పోసేందుకు పాఠశాల ఆరుబయట నిర్జన ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెత్తలో పడిఉన్న సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం ఉపయోగించే పవర్‌ బ్యాంకు లభించింది. దీంతో దాన్ని జేబులో పెట్టుకుని పాఠశాల ఆవరణలో తిరిగాడు. ఇంతలోనే పవర్‌బ్యాంకు పేలింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన విద్యార్థి రాకేశ్‌ను వెంటనే ఉపాధ్యాయులు, గ్రామస్తులు జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎంఈఓ జాకీర్‌ హుసేన్‌ విద్యార్థిని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement