అదృశ్యం.. ఆపై వాగులో పడి మృతి | - | Sakshi
Sakshi News home page

అదృశ్యం.. ఆపై వాగులో పడి మృతి

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

మిరుదొడ్డి(దుబ్బాక): అదృశ్యమైన వృద్ధురాలు వాగులోపడి మృతి చెందింది. ఈ సంఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్‌ఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎమ్మ సాలవ్వ(70) మతి స్థిమితం సరిగా లేక తిరుగుతుండేది. ఇది వరకు సాలవ్వ పలు మార్లు అదృశ్యమై దొరికిన దాఖలాలు ఉన్నాయి. కాగా ఈ నెల 24న భూంపల్లిలో జరిగిన బంధువుల వివాహ వేడకకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమె తప్పిపోయింది. అదే రోజు కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదైంది. కాగా సాలవ్వ ప్రమాదవశాత్తు కూడవెల్లి వాగులో పడిమృతి చెందినట్లు స్థానికులు మంగళవారం గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement