ఇద్దరికీ గాయాలు
కౌడిపల్లి(నర్సాపూర్): రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా ఒక బైక్ రోడ్డుపై రాపిడికి గురై మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన 765డి జాతీయ రహదారిపై మండలంలోని రాయిలాపూర్‌గేట్ గుడివద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ, స్థానికుల వివరాల ప్రకారం.. రాయిలాపూర్‌కు చెందిన భిక్షపతి తన బైక్‌పై వెళ్తున్నాడు. కాగా హైదరాబాద్ దూలపల్లికి చెందిన వ్యక్తి తన బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు కిందపడగా స్వల్పగాయాలయ్యాయి. కాగా దూలపల్లి వ్యక్తికి సంబంధించిన బైక్ రోడ్డుపై రాపిడికి గురవడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పే ప్రయ త్నం చేయగా అప్పటికే పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయమై ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.


