సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు

Jul 22 2026 8:54 AM | Updated on Jul 22 2026 8:54 AM

సీజనల్‌ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు

టేక్మాల్‌(మెదక్‌): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌ రాథోడ్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన టేక్మాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో కలియ తిరుగుతూ రోగులతో మాట్లాడారు. అనంతరం వైద్య సిబ్బందితో ఎన్సీడి, టీబీ, ఎంసీహెచ్‌, హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌ మొదలగు వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రభుత్వ వైద్య సేవలు సజావుగా అందాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి అనిత, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌, సీహెచ్‌ఓ కృష్ణవేణి, పీహెచ్‌ఎన్‌ సాయిబాబా పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌ రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement