
అప్‌గ్రేడ్‌తో మెరుగైన వైద్య సేవలు
సంగారెడ్డి జోన్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డెరెక్టర్ సెకండరీ హెల్త్‌గా త్వరలో అప్‌గ్రేడ్ చేస్తామని, దీంతో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు దోహదపడుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సేవలందిస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించినందుకు శుక్రవారం సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ప్రతినిధులు కలిసి దామోదరకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న 1,690 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించనున్నట్లు చెప్పారు. బోధనేతర విభాగంలో డీఎంఈ, డీహెచ్, టీవీవీపీలలో టైం బాండ్ ప్రమోషన్ల భర్తీలో వయోపరిమితి పెంపుపై కామన్ నిబంధనలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు డా.నరహరి, సెక్రెటరి జనరల్ డా.లాలు ప్రసాద్, డా.రావూఫ్, డా.వినయ్ కుమార్, డా.గోపాల్, డా.క్రాంతి, డా.అశోక్, డా.రామ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులభర్తీకి గ్రీన్ సిగ్నల్