
చందా కోసం రోడ్డుకు అడ్డంగా తాడు
బైక్ పైనుంచి కిందపడి మహిళ తలకు గాయాలు
తూప్రాన్: వినాయక చందాల కోసం రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు బైక్‌పై వెళుతున్న దంపతులకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పరిధిలోని ఆబోతుపల్లిలో శుక్రవారం జరిగింది. బాధితుల వివరాలు ప్రకారం... చందా కోసం చిన్నారులు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూప్రాన్ నుండి గుండ్రెడ్డిపల్లి వైపు బైక్‌పై వెళుతున్న చింతకింది నారాయణగౌడ్, లావణ్య దంపతులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో లావణ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్‌పత్రికి తరలించారు. కాగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.