
పురుగుల మందు తాగి వృద్ధురాలు
చిన్నశంకరంపేట(మెదక్): అనారోగ్యంతో బాధపడుతూ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నార్సింగి మండలం వల్లూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సృజన కథనం మేరకు... మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం చంద్రగిరినగర్‌కు చెందిన మన్నె లక్ష్మి(65) అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటుంది. పనులకు వెళ్లిన కుమారుడు ఉమేశ్ సాయంత్రం వచ్చి చూడగా తల్లి కనిపించలేదు. దీంతో బంధువులు, తెలిసిన వారి ఆచూకీ కోసం వెతకగా.. వల్లూర్ జాతీయ రహదారి పక్కన బస్టాండ్ సమీపంలో నురుగలు కక్కుతూ పడిపోయిందని సమాచారం అందుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా మృతి చెంది ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ..
తూప్రాన్: పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దతార్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన చింతల పవన్‌కళ్యాన్(24) ఆర్థిక ఇబ్బందులతో గత నెల13న పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. తిరిగి 22న మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుని భార్య పరమేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.