
సాగు సంబురం
కాలువ నీటితో సాగు..
వానలు ఆలస్యంగా కురవ డంతో వరి నాట్లు ఆలస్యమవుతు న్నాయి. ఉత్తర భారత కూలీలు రావడంతో నాట్లు సులభమవుతా యి. నేనే ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేస్తు న్నా.
–కుమ్మరి రాజు (రైతు, ముద్దాయిపేట)
సన్నాలు వేశాం
ఏడెకరాల్లో సన్న రకం వరి వేశాం. ఎప్పుడూ ఒకే రకం విత్తనం కాకుండా మార్పు చేయాలని సన్నరకం నాటాము.
–పుష్పలత (ముద్దాయిపేట రైతు)
పుల్‌కల్(అందోల్): రెండు పంటల విరామానంతరం వ్యవసాయానికి సింగూరు నీరు వదలడంతో రైతులు సాగు సంబురాల్లో మునిగిపోయారు. సింగూరు సాగునీరు ఆలస్యంగా విడుదల చేయడంతో ఖరీఫ్ వరి సాగు ఆలస్యంగా మొదలై ఆగస్టు చివరినాటికి పూర్తి కానున్నాయి. జూన్ ఆఖరి వారంలో విడుదల చేయాల్సిన నీరు జూలై 17న విడుదల చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ లిప్టులను ఆన్‌చేసి నీరు విడుదల చేయడంతో ఆయకట్టు కింద రైతులు వరి సాగు పనులు పెట్టారు. సింగూరు ఆయకట్టు కింద పుల్‌కల్,చౌటకూర్,అందోల్ మండలాలతో వరి చేలు తడుపుతు చెరువుల్లోకి చేరుతాయి. సుమారు 145 చెరువులకు సింగూరు కాలువలతో అనుసంధానం చేశారు.
40 వేల ఎకరాల్లో
ఎడుమ కాలువ ఆయకట్టు పరిధిలో సాగునీరు విడుదల చేయడంతో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఆగస్టు రెండో వారం వరకు వరి సాగు చేసినా దిగుబడుల్లో ఢోకా లేకపోవడంతో వరి పంటకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాలువ కింది ఆయకట్టు రైతులతోపాటు చెరువులు నిండటంతో చెరువుల కింది ఆయకట్టు రైతులు కూడా వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడం, యాసంగిలో సన్నరకం పండించిన రైతులకు బోనస్ నగదు రైతు ఖాతాల్లో జమకావడంతో వానాకాలంలో ఎక్కువగా సన్నరకాలకు మొగ్గుచూపారు.
ఉత్తరభారత కూలీలతో తీరిన కొరత
వరి నాట్లు వేయడానికి ఉత్తర భారత్‌కు చెందిన రాష్ట్రాల నుంచి కూలీలు రావడంతో వరినాట్లు సులభంగా అవుతున్నాయి. ఈ కూలీలకు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5 వేలు చెల్లిస్తున్నారు.
చివరి ఆయకట్టుకు అందేనా?
సింగూరు కాలువ 60 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందోల్ మండలంలోని చివరి ఆయకట్టు రైతులకు నీరు రావడం లేదని రైతులు ఆరోపించారు. చివరి ఆయకట్టు కాలువల్లో నీరు పారాలంటే సింగూరులో నీటి పంపింగ్ ఎక్కువగా జరగాలి. వర్షాలు కురుస్తుండటంతో అధికారులు నీటి ప్రవాహాన్ని తగ్గించారు.
ఏడాది తర్వాత కాలువల్లో సింగూరు జలాలు
రైతుల్లో హర్షాతిరేకం

సాగు సంబురం

సాగు సంబురం