
సంగారెడ్డికి రూ.28కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణాభివృద్ధికి హైదరాబాద్ మహనగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి బైపాస్‌రోడ్డును 4 లైన్లుగా విస్తరణ కోసం రూ.12 కోట్లు, రాజీవ్‌పార్కు అభివృద్ధికి రూ.12 కోట్లు, శిల్ప వెంచర్ రోడ్డుకు రూ.4.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి గురువారం ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...కొండాపూర్ (మల్లేపల్లి)–హరిదాస్‌పూర్ వరకు డబుల్‌లైన్ రోడ్డు విస్తరణ, తంగేడుపల్లి–మల్లారెడ్డిపేట్ రోడ్డు వెడల్పుకు రోడ్లు భవనాల శాఖ నుంచి, కొండాపూర్–సదాశివపేట్, కలివేముల–మక్త అల్లూరు గ్రామం రోడ్డుకు పంచాయతీరాజ్‌శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంత్ కిషన్, జూలకంటి ఆంజనేయులు, కూన సంతోష్‌తోపాటు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఎంపీడీవో
కార్యాలయం తనిఖీ
హత్నూర(సంగారెడ్డి): తుర మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

సంగారెడ్డికి రూ.28కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు