
వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం
పుల్‌కల్‌లో వృద్ధుడు..
ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక..
పటాన్‌చెరు టౌన్: బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జిగేన్ బతుకుదెరువు కోసం వచ్చి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఘనపూర్ సమీపంలోని ఓ కంపెనీలో కూలి పని పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఈ నెల 21న జిగేన్ కూతురు ఆసియా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్థానికంగా, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.
నర్సాపూర్‌లో వ్యక్తి..
నర్సాపూర్ రూరల్: వ్యక్తి అదృశ్యమైన ఘటన నర్సాపూర్‌లో శనివారం వెలుగు చూసింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన మహమ్మద్ అఖిల్ అలియాస్ మహమ్మద్ ఫక్రు పోలీస్ స్టేషన్ ఎదురుగా మిర్చి బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల19వ తేదీ రాత్రి వరకు మిర్చి బండి నడిపి ఆ తర్వాత ఇంటికి వెళ్లకుండా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైలు ఎక్కుతూ కిందపడి..
మనోహరాబాద్(తూప్రాన్): రైలు ఎక్కబోయి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మనోహరాబాద్ రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్‌ఐ లిబాంద్రి వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన తాడేపు కిష్టయ్య ( 71 ) రైల్వేలో లోకో పైలట్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశాడు. కాగా కుటుంబ సభ్యులతో బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గరలో నివాసం ఉంటున్నాడు. అతడికి వ్యవసాయ పొలం ఉండటంతో గ్రామానికి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మనోహరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బోధన్– కాచిగూడ పాసింజర్ రైలు కదులుతుండగా బోగిలోకి ఎక్కబోయి అదుపుతప్పి రైలు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడు రెండు కాళ్లు కోల్పోయాడు. గమనించిన స్థానికులు మేడ్చల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతునికి భార్య, కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు.

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం

వేర్వేరు చోట్ల నలుగురు అదృశ్యం