ప్రాంతాలు, మతాలు, కులాలు వేరైనా అందరం ఒకే కుటుంబ సభ్యుల
● సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి ● పండుగేదైనా కలిసి చేసుకుంటారు ● సామాజిక సేవలో సైతం ముందంజ
సమస్యలపై పోరాటం
ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శం.. గేటెడ్ కమ్యూనిటీలు
సొంత గ్రామంలో ఉన్నట్లే..
తాము ఈ ప్రాంతంలో విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఉన్నప్పటికీ మా సొంత ప్రాంతంలో ఉన్నట్టే ఉంది. అనేక ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఉంటున్నారు. కలిసిమెలిసి సంతోషంగా ఉంటాం.
– పి.ఎస్.తివారీ, వ్యాపారవేత్త
అత్యవసర సమయంలో..
ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న వైద్యులు అత్యవసర సమయంలో వైద్యం అందించటానికి సిద్ధంగా ఉన్నాం.
– డా.భవాని ఈశ్వర్ గారి, తెల్లాపూర్
సమైక్య భావాన్ని..
దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. అన్ని పండుగలను కలిసి జరుపుకుంటాం. జాతీయ ఐక్యతను చాటుతూ సమైక్య భావాన్ని పెంపొందిస్తున్నాం.
– చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, తెల్లాపూర్
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా ఆయా ప్రాంతాల వారి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కుల, మతాలను పక్కన పెట్టి పండుగలు జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వనభోజనాలను ఘనంగా నిర్వహిస్తారు. ఒడిశా ప్రజలు ఘనంగా జరుపుకునే జగన్నాథ రథయాత్రను అందరూ కలిసి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ వేడుకలను సైతం జరుపుకుంటారు.
కాలనీవాసులు సామాజిక సేవలో సైతం ముందున్నారు. స్థానిక చెరువు పరిసరాలను శుభ్రం చేయడంలో చిన్నారులు సైతం చురుకుగా పాల్గొంటున్నారు. ప్రతి వేసవిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత శిబిరాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు తరగతులు కూడా నిర్వహించారు. కోవిడ్ సమయంలో సుమారు 3వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. అందరూ కలిసి పేద విద్యార్థులకు షూలు, పుస్తకాలు ఇచ్చారు. ఐటీ ఉద్యోగులు ఎవరికై నా ఉద్యోగం కావాలంటే తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు సంపాదించేలా సూచనలు ఇస్తారు.
కాలనీల్లో నెలకొన్న సమస్యలపై గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఉమ్మడి పోరాటాలు చేస్తూ అందరికి స్ఫూర్తినిస్తున్నారు. ఏ కాలనీలో సమస్య వచ్చినా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రోడ్లపైకి వచ్చి పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో అందరం ఒక్కటే అన్న భావన మరింత పెంపొందుతోంది. అలాగే పలువురికి సాయం చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
సామాజిక
సేవలో సైతం