
కూతురి మృతి తట్టుకోలేక తండ్రి..
హవేళిఘణాపూర్(మెదక్): కన్న కూతురు మృతి తట్టుకోలేక ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని సర్దన గ్రామంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పిల్లి కృష్ణ(40) పెద్ద కుమార్తె వెంకటలక్ష్మి గత ఏడాది క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఈ విషయంలో తండ్రి అనేకమార్లు బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని కుంటకట్ట వద్ద గల చెట్టుకు ఉరివేసుకున్నాడు.
నర్సాపూర్‌లో మహిళ...
నర్సాపూర్ రూరల్: అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య వేసుకుంది. ఈ ఘటన శనివారం నర్సాపూర్‌లో జరిగింది. ఎస్సై లింగం వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన చిత్తారి శాంత (34) కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో చేసుకుంది. మృతురాలికి కుమారుడు, భర్త శ్రీనివాస్ ఉన్నారు.
అనారోగ్యంతో వృద్ధురాలు...
బెజ్జంకి(సిద్దిపేట) : అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు ఇలా... తోటపల్లి గ్రామానికి చెందిన రేవోజు లక్ష్మి(55) స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంది. అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం భర్త శంకరయ్య మృతి చెందాడు. వారి ముగ్గురు కూతుర్లకు వివాహాలు జరిగాయి. లక్ష్మి ఒంటరిగానే ఉంటోంది. నెల రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆమె బాధ పడుతుంది. ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా లివర్ చెడిపోయిట్లు గుర్తించారు. చికిత్స నిమి త్తం కరీంనగర్ వెళ్లేందుకు బెజ్జంకి బ్యాంకు ఖాతా లో ఉన్న డబ్బులు తీసుకువస్తానని బిడ్డలకు చెప్పి శుక్రవారం వెళ్లింది. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో ఆరా తీయగా మా మిడితోట వైపునకు వెళ్లినట్లు చెప్పారు. వెంటనే కూతుర్లు అక్కడకువెళ్లి చూడగా క్రిమిసంహారక మందు తాగి బావిలో దూకినట్లు గుర్తించారు. అనారోగ్యంతో మననస్తాపం చెంది లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిజాంపేటలో మహిళ..
నిజాంపేట(మెదక్): మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన వొగుల రాజవ్వ(55) తన ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. బయటి నుంచి కొడుకు ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి ఆత్మహత్య చేసుకొని కనిపించింది. మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.