'మద్యం తాగొద్దన్నందుకు' కాదు.. కావాలనే ఇలా చేశారు! | - | Sakshi
Sakshi News home page

'మద్యం తాగొద్దన్నందుకు' కాదు.. కావాలనే ఇలా చేశారు!

Oct 26 2023 7:52 AM | Updated on Oct 26 2023 11:07 AM

- - Sakshi

అజీమ్‌ (ఫైల్‌)

సాక్షి, మెదక్‌: ఇంటి సమీపాన మద్యం తాగడం సరికాదని ఓ వ్యక్తి, ముగ్గురితో అన్నందుకు గాను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మండలంలోని బొల్లారం మున్సిపల్‌ పరిధిలో మంగళవారం రాత్రి వెలుగుచూసింది. సీఐ నయీముద్దీన్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి వాసి అజీమ్‌(35) బొల్లారంలోని గాంధీ నగర్‌లో నివాసముంటూ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బయటకు వచ్చి వాకింగ్‌ చేస్తున్నాడు. ఇంటికి సమీపంలో ముగ్గురు మద్యం తాగడాన్ని గమనించాడు. రాత్రి సమయంలో ఇక్కడ మద్యం తాగడం సరైంది కాదని లక్ష్మణ్‌, విశాల్‌, మన్నూ కుమార్‌తో అజీమ్‌ దురుసుగా చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిపై ఉమ్మడిగా దాడికి తెగబడ్డారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై మోదగా అక్కడికక్కడే అతను ప్రాణాలు విడిచాడు.

ఈ విషయాన్ని సమీపంలోకి వ్యక్తులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. అజీమ్‌ను కావాలనే హత్య చేసి ఉంటారని, గతంలో సైతం గొడవలు జరిగాయని పలువురు అంటున్నారు.
Follow the Sakshi TV channel on WhatsApp:

Advertisement
 
Advertisement
Advertisement