తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌! | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌!

Jul 24 2023 6:26 AM | Updated on Jul 24 2023 9:43 AM

- - Sakshi

మెదక్‌: మండలంలోని మిర్జాపల్లిలో శనివారం అర్ధరాత్రి తాళం వేసిన ఆరు ఇళ్లల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెండి, బంగారంతోపాటు కోళ్లు ఎత్తుకెళ్తారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ కథనం మేరకు... మిర్జాపల్లిలోని శ్రీకాంత్‌గౌడ్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. అర తులం బంగారపు ఉంగరం, 20 తులాల వెండి పట్టాగొలుసులు, రూ.5 వేల నగదు అపహరించారు.

అలాగే సంగని శ్రీనివాస్‌, తాళ్ల శేఖర్‌గౌడ్‌, గడ్డమీది ముత్యాలు, కాయితి చంద్రయ్యకు చెందిన ఇళ్ల తాళలు పగలగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. పారిపోతూ చింతల కిష్టయ్యకు చెందిన మూడు కోళ్లు ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో వీరి కుటుంబసభ్యులు నిద్రిస్తున్నారు. మెదక్‌ క్లూజ్‌ టీం బాధితుల ఆరు ఇళ్లను పరిశీలించింది. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement