మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు నమోదు చేయించుకుని పటాన్‌చెరును రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు, కార్మికులకు ఆదివారం ఎస్‌ఐఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటుహక్కు చాలా కీలకం అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించారు. ఇటీవల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న నాయికోటి రాజును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, మెట్టు కు మార్ యాదవ్, బాల్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రె డ్డి, అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, భిక్షపతి, పృథ్వీరా జ్, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌లో భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


