బాధ్యతాయుతంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా పనిచేయాలి

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

నారాయణఖేడ్‌: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణకు వారం రోజులే గడువు ఉన్నందున బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, ’సర్‌’ ఖేడ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఫయీం, ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఆదివారం ఖేడ్‌ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ బీఏల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ బూత్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని బీఎల్‌ఓలకు ఫారాలు అందజేశారా..? లేదా అనే విషయాన్ని స్వయంగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఇంకా సమర్పించని వారిని గుర్తించి అవసరమైన సహాయం అందించి వెంటనే ఫారాలు అందజేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ సర్‌ ప్రక్రియను శతశాతం పూర్తిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండలాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement