
ఆర్థిక సమస్యలతో ఓ గృహణి ఆత్మహత్య చేసుకుంది.
మనోహరాబాద్(తూప్రాన్): ఆర్థిక సమస్యలతో ఓ గృహణి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సందీప్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...మండలపరిధిలోని కాళ్ళకల్‌కు చెందిన చెనిగారపు స్వాతి(30) ఆర్థిక సమస్యలతో గురువారం ఇంట్లోనే విషం తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం మేడ్చల్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడున్నారు.