తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): కళ్లెదుటే కన్నకొడుకులు మృతి చెందడం ఆ తల్లిని కలిచివేసింది. కొడుకుల వెంటే తాను వస్తానని కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి మండలం శంకాపూర్ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ సృజన కథనం మేరకు.. రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన శాలిపేట రుక్కమ్మ(80), ఐదుగురు సంతానం. ఇందులో నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గతంలో ఇద్దరు కుమారులు సత్తయ్య, లక్ష్మయ్య విద్యుత్ షాత్‌తో మృతి చెందారు. తాజాగా 15 రోజుల క్రితం మరో కుమారుడు నర్సింహులు ఆనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మనస్తాపానికి గురైన రుక్కమ్మ తాను ఆత్మహత్య చేసుకుంటానని తరుచు అంటుండగా కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి ఓదార్చారు. అయినప్పటికీ ఈ నెల 4న బయటకు వెళ్లి తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం శంకాపూర్ శివారులోని అటవీప్రాంతంలో వృద్ధురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెల్లి చూడగా రుక్కమ్మగా గుర్తించారు. పెద్ద కుమారుడు సిద్దిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రద్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ సృజన తెలిపారు.


