సిద్దిపేటఅర్బన్: విధి నిర్వహణలో ఉన్న పంచాయతీ కార్యదర్శిని దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అర్బన్‌మండలం పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని మందపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న భవానిపై అదే గ్రామానికి డి.ప్రశాంత్ కొంతమందితో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడాడన్నారు. విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించి చట్టరీత్యా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


