ముగిసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలు

Mar 7 2026 10:13 AM | Updated on Mar 7 2026 10:13 AM

ముగిసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలు వీబీజీరామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి రోడ్డు ప్రమాదంలో పదోతరగతి విద్యార్థి మృతి

మిరుదొడ్డి(దుబ్బాక): నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట సహకారంతో నైపుణ్య ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. వాలీబాల్‌, కబడ్డీ, 600, 400 మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన క్రీడాకారులకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పెద్ద కుర్మ కరుణాకర్‌, నైపుణ్య ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ ఐలయ్య, పీఈటీలు అందె రామచంద్రం, తోట వెంకట్‌రెడ్డి, ధర్మారం దశరథం, దేవరాజు, భాగ్యలక్ష్మి, ప్రవీణ్‌కుమార్‌, కనకరాజు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

కొండాపూర్‌ (సంగారెడ్డి): గ్రామీణ ఉపాధిని దెబ్బతీసే ‘వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని’రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు మండల పరిధిలోని గంగారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీ పఽథకాన్ని భూస్వాములకు, పెట్టుబడుదారులకు అనుకూలంగా మారుస్తుందని విమర్శించారు. ఉపాధిని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, కూలీలకు ఫొటో క్యాప్చర్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి వీబీజీ–రామ్‌ జీ స్కీమ్‌ను తెచ్చి రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపిందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 20న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న ధర్నా లో కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం కొండాపూర్‌ మండల కార్యదర్శి రాజయ్య మండల కమిటీ సభ్యులు బాబురావు, నాయకులు అనిల్‌, రాంచందర్‌, ఎస్‌ఎఫ్‌ ఐ నాయకులు అర్జున్‌, ఉపాధి కూలీలు అమృతమ్మ,లక్ష్మమ్మ, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

బైక్‌పై వెళ్తుండగా డివైడర్‌ ఢీకొని..

సిద్దిపేటకమాన్‌: స్నేహితులతో సరదాగా ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాకకు చెందిన యాదగిరి స్వరూప దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడు మాడబోయిన రామ్‌చరణ్‌(16) లచ్చపేట ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వరుసకు సోదరుడైన రాజుతో కలిసి శుక్రవారం బైకుపై సిద్దిపేటకు వచ్చారు. తిరిగి దుబ్బాకకు వెళ్తున్న క్రమంలో ఎల్లమ్మ ఆల యం వద్ద మూలమలుపులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. బైక్‌ నడుపుతున్న రామ్‌ చరణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు సల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు అరుణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కొనుగోలు కేంద్రం

ఏర్పాటు చేయండి

హుస్నాబాద్‌: వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement