బడంగ్‌పేట్: రాష్ట్ర స్థాయి చెస్ అండ్ బ్యాడ్మింటన్ పోటీలు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. గుర్రంగూడలోని బ్రిగేడ్ విస్టా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రగ్బీప్లేయర్, అమెరికన్ ఫుట్‌బాల్ మెంటర్ గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఏకగ్రతకు తోడ్పాటు అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకాడమిక్ లీడర్ విజయలక్ష్మీ సాగర్, డైరెక్టర్ విశ్వనాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి గుంట, చెస్ రెఫరీలు జ్యోతి గణేశ్, కె.రామారావు, ఎస్.ప్రసాద్, బ్యాడ్మింటన్ రెఫరీలు కె.కిరణ్, పొన్నాల సంతోశ్, ఎర్లేన్, అమిత్ డి క్రూజ్, అబ్దుల్ ముక్తందీర్ జైన్, శివాజీ నీలం, అనిత, జాన్ పాల్గొన్నారు.
రగ్బీప్లేయర్, అమెరికన్ ఫుట్‌బాల్
మెంటర్ గోపీనాథ్


