బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

మున్సిపల్‌, జల మండలి, రెవెన్యూ శాఖల సంయుక్త పరిశీలన

హిమాయత్‌సాగర్‌లో వెలిసిన అనుమతి లేని కట్టడాల గుర్తింపు

మొయినాబాద్‌: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ జలాశయం బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం మొయినాబాద్‌ మున్సిపల్‌, జలమండలి, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా హిమాయత్‌సాగర్‌ జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి అజీజ్‌నగర్‌ సమీపంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో కొంత స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. బఫర్‌ జోన్‌లో కొన్ని నిర్మాణాలు చేపట్టినట్లు అధికారుల సర్వేలో తేలింది. హిమాయత్‌సాగర్‌ జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని.. జలమండలి, హైడ్రా అధికారులు ఇచ్చే నివేదిక ప్రకారం నిర్మాణాలను కూల్చివేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం గోవింద్‌గౌడ్‌, సీఐ శ్రీకాంత్‌గౌడ్‌, ఎస్‌ఐ విక్రంరెడ్డి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి వాణి, ఆర్‌ఐ రాజేష్‌, సర్వేయర్‌ జలజ, జీపీఓలు జానకిరాం, నర్సింలు, మున్సిపల్‌ సిబ్బంది సుదర్శన్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement