విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ జగదీష్‌

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

ఇబ్రహీంపట్నం రూరల్‌: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ జగదీష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 1,500 మంది విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. పేద, మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తల్లిదండ్రులు అప్పు చేసి పిల్లల చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు సాయిచరణ్‌, మణికంఠ, ప్రదీప్‌, ఆదర్శ్‌, మహేందర్‌, భరత్‌, మైపాల్‌, రాజేష్‌, వినయ్‌, ప్రణిత్‌, కార్తీక్‌, సందీప్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement