హుడాకాంప్లెక్స్: చేనేతలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రాయబండి పాండురంగం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం డాక్టర్స్ కాలనీ డివిజన్‌లో శ్రీ భక్త మార్కండేయ చేనేత సంఘం అధ్యక్షుడు నామ దుర్గయ్య, సంఘం మార్గదర్శకుడు కుంట్ల ఆంజనేయులు నేత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేతల జనాభాకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో అంత వాటా కేటాయించాలని కోరారు. డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని, చేనేత పరిశ్రమ ద్వారా ప్రతి చేనేత బిడ్డకురూ.10 లక్షలు బ్యాంకుతో నిమిత్తం లేకుండా ఆర్థిక తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ చేనేతలు నేసిన దుస్తులు వాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.


