చేవెళ్ల: పట్టణ కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో రాత్రి భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం రాత్రి హాస్టల్ వద్దకు చేరుకున్నారు. పురుగులు వచ్చిన భోజనాన్ని విద్యార్థులు వారికి చూపించారు. ప్రతి రోజు ఇలాగే వస్తున్నాయని వాపోయా రు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్‌కుమార్ అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు ఉండే హాస్టళ్లకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటిబియ్యం అందిస్తున్న వారిపై చర్యలు తీసు కోవాలని, హాస్టళ్ల పరిస్థితిపై కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చందు, అశోక్ పాల్గొన్నారు.


