అమీర్‌పేటలో దారుణం.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

Hyderabad-Ameerpet: భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య

May 17 2023 7:12 AM | Updated on May 17 2023 8:11 AM

- - Sakshi

ప్రేమలత, జనార్దన్‌ (ఫైల్‌)

రంగారెడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త..ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అమీర్‌పేటలో జరిగిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఇన్స్‌పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటకు చెందిన మంచాల లక్ష్మి కుమార్తె ప్రేమలత (35)కు ఎల్లారెడ్డిగూడ అంబేడ్కర్‌నగర్‌ పోచమ్మ దేవాలయం సమీపంలో ఉండే ఆగమయ్య కుమారుడు జనార్దన్‌(40)తో 2004లో వివాహం జరిగింది.

వీరికి 17 ఏళ్ల కుమారుడు నిఖిల్‌ బాలాజీ, 16 ఏళ్ల కుమార్తె లిఖిత ఉన్నారు. ప్రేమలత కూకట్‌పల్లిలోని ఓ డెంటల్‌ క్లినిక్‌లో పనిచేస్తుండగా జనార్దన్‌ ఏ పనీ చేయక మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో తరచు గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో సోమవారం ప్రేమలత తల్లిదండ్రుల వివాహ దినోత్సవం ఉండడంతో అందరు కలిసి తూంకుంటకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం ఇద్దరు విగత జీవులుగా పడిఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి జనార్దన్‌ ముందుగా భార్యను హత్య చేసినట్లు గుర్తించారు. ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. తరువాత చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ప్రేమలతది హత్య కేసుగా నమోదు చేశారు. జనార్దన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement