జాతీయ పతాకంపై గౌరవం పెరగాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ పతాకంపై గౌరవం పెరగాలి

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

జాతీయ పతాకంపై గౌరవం పెరగాలి మొయినాబాద్‌: జాతీయ పతాకంపై ప్రతి ఒక్కరికీ గౌరవం పెరగాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌ అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలో మంగళవారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో ఐక్యత, దేశభక్తి పెరగాలన్నారు. జాతీయ జెండాను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలనే సంకల్పంతో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేశ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం యాదవ్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకుడు కంజర్ల ప్రకాష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమతరెడ్డి, కౌన్సిలర్‌ కిషన్‌, బీజేవైఎం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ పాల్గొన్నారు. చటాన్‌పల్లి ఆర్‌ఓబీ స్థలం పరిశీలన షాద్‌నగర్‌: మున్సిపల్‌ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి స్థలాన్ని మంగళవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ గతి శక్తి కార్యాలయం అధికారి రాజారెడ్డి, రైల్వే విశ్రాంత డిప్యూటీ కలెక్టర్‌ శంకర్‌కుమార్‌, తహసీల్దార్‌ నాగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, టీపీఓ పావని, ఆర్‌ అండ్‌ బీ డీఈ శ్రీలత, ఏఈ రాజశేఖర్‌ పరిశీలించారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూ, ప్లాట్ల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. స్ధలాలు కోల్పోయే వారి జాబితాను రూపొందించి పరిహారం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఓబీ నిర్మించే స్థలాన్ని పరిశీలించి త్వరలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన మొయినాబాద్‌: వ్యర్థాలు, చెత్తాచెదారంతో సేంద్రియ ఎరువుల తయారీపై మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌ డంపింగ్‌యార్డులో మంగళవారం మున్సిపల్‌ కమిషనర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని కంపోస్ట్‌ డెవల ప్‌మెంట్‌ ఆఫీసర్‌ హేమలత, ఎన్‌ఐయూఎం రీసెర్చ్‌ అసోసియేట్‌ నసీమా తెలిపారు. తడి, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, న్యాప్కిన్స్‌ వంటి వేస్టేజీలను నాలుగు వేర్వేరు డబ్బాల్లో వేయాలని.. దీనిపై ప్రజలకు అవగా హన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్‌, ఇబ్రహీంపట్నం, గుమ్మడిదల, ఇస్నాపూర్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, ఆమనగల్లు, ఇంద్రేశం మున్సిపల్‌ కమిషనర్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో మల్టీ స్పెషాలిటీ ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో వేలాది పరిశ్రమలు ఉన్నాయని, లక్షలాది మంది కార్మికులను దృష్టిలో పెట్టుకొని మల్టీ స్పెషాలిటీ ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలని ఏఐటీయూసీ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్‌ కిరణ్మయిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులు అనారోగ్యానికి గురైతే సనత్‌నగర్‌, నాచారం వెళ్లాల్సి వస్తోందని అన్నారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చెవెళ్ల, షాద్‌నగర్‌ నియోజకవర్గాలో పని చేస్తున్న కార్మికులు సనత్‌నగర్‌ వెళ్లాలంటే 100 కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లలేక ప్రైవేటును ఆశ్రయిస్తున్నారని, వేలకు వేల రూపాయలు ఖర్చవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పర్వతాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement