సాక్షి, రంగారెడ్డి జిల్లా: శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్‌ను మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎల్‌బీనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.


