మైనింగ్‌ భూమి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ భూమి స్వాధీనం

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

మైనింగ్‌ భూమి స్వాధీనం

కందుకూరు: ఫ్యూచర్‌సిటీలోని మైనింగ్‌భూమిని టీజీఐఐసీ అధికారులు రెవెన్యూ, పోలీస్‌ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ సర్వే నంబర్‌ 112లోని దాదాపు 551 ఎకరాల అసైన్డ్‌ భూమిని గతంలో టీజీఐఐసీ ఫార్మాసిటీ కోసం సేకరించింది. అందులో సుమారు 50 ఎకరాలు కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం మైనింగ్‌ కోసం లీజ్‌కు ఇవ్వడంతో ఆ భూమిని వదిలేసింది. ప్రస్తుతం లీజ్‌ గడువు పూర్తవడంతో మంగళవారం డీసీపీ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐ సత్యనారాయణ, తహసీల్దార్‌ గోపాల్‌, నాయబ్‌ తహసీల్దార్‌ శేఖర్‌ సమక్షంలో టీజీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ జ్యోతి సిబ్బందితో కలిసి మైనింగ్‌ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్‌ పనులు చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement