ఇల్లంతకుంట: మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం తాగునీటి ఎద్దడిపై సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని సర్పంచుల మామిడి రాజు, నాయిని నవీన్ కుమార్, నేరళ్ల విజయ్ గౌడ్ ఆరోపించారు. సోమారంపేట సర్పంచ్ భారతవ్వ మాట్లాడుతూ రూ.5వేలకు ట్రిప్పు ఇసుక తెప్పించానన్నారు. ఓబులాపురం, వెల్జీపూర్, మధ్య ఇసుక డంపు ఉందని మండలానికి ఇసుక సరిపోతుందని అధికారులు పర్మిషన్ ఇవ్వాలని ఇల్లంతకుంట సర్పంచ్ మామిడిరాజు కోరారు. మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు ఇప్పిస్తానని తెలిపారు. పొత్తూరు మానేరు వాగువద్ద ఇసుక రీచ్ మంజూరు చేయాలని 5 నెలలుగా కోరుతున్నా మంజూరు చేయడంలేదని సర్పంచులు వాపోయారు. ప్రత్యేకాధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండలానికి 275 ఇంకుడుగుంతలు మంజూరయ్యాయని గ్రామాల్లో నిర్మించాలని కోరారు. 63 పశువుల నీటి తొట్టెలు మంజూరైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, డిప్యూటీ ఈఈ ఇంట్రా పావని, సర్పంచులు భాస్కర్ రెడ్డి, మామిడి రాజు, విజయ్‌గౌడ్, నాయిని నవీన్‌కుమార్, చంద్రారెడ్డి, పండుగ సునీత, కనకరాజు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.


