సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్యనగర్ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. మరోవైపు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రం పనిచేయడం లేదు. బోరునీటిపైనే ఆధారపడుతున్నారు. ఈ విషయమై హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా బాత్‌రూమ్‌లకు గీజర్ లేకపోవడంతోనే గీజర్ ఉన్న నల్లాల వద్ద విద్యార్థులు స్నాలు చే స్తున్నారని తెలిపారు. శుద్ధజలయంత్రం పాడయిందన్నారు. మరమ్మతులు చేయించినా బాగుపడడం లేదని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.


