అర్హులకు సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ ఫలాలు

Nov 13 2026 12:40 AM | Updated on Nov 13 2026 12:40 AM

అర్హులకు సంక్షేమ ఫలాలు

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ: అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పట్టణంలో గురువారం నిర్వహించిన నూతన పెన్షన్‌ పత్రాల పంపిణీలో పాల్గొని మాట్లాడారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19 నుంచి కొత్త పెన్షన్ల నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లాలో కొత్తగా 8,209 పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 1,13,264 మందికి పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేతకార్మికులు, ఫైలేరియా, డ యాలసిస్‌ బాధితుల నుంచి ఇప్పటికే దరఖాస్తుదారులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం అధికారులతో విచారణ చేయించామన్నారు. ఈనెల 18 వరకు మంజూరు పత్రాలు అందిస్తామన్నారు. 19 తర్వాత లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమవుతాయని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా వసతులు కల్పించే పనులు చేయిస్తున్నామన్నారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలుకల తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ప్యాక్స్‌ చైర్మన్లు వకుళాభరణం శ్రీనివాస్‌, బొమ్మెన భాస్కర్‌, ఏగోలపు శ్రీనివాస్‌, గసికంటి ప్రభాకర్‌, పిల్లి కనకయ్య, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, తహసీల్దార్‌ జయంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement