సిరిసిల్ల: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్సీఎస్) సేవలను విస్తృతం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం ఐఆర్సీఎస్ మేనేజింగ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం సేవా కార్యక్రమాలు చేపట్టాలని, నూతన్ బ్లడ్‌బ్యాంక్, ఆఫీస్ ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు పెంచాలన్నారు. ఐఆర్సీఎస్ జిల్లా చైర్మన్ గూడూరి రవీందర్, వైస్ చైర్మన్ ప్రయాకర్రావు వేణుకుమార్, సెక్రటరీ డాక్టర్ చీకోటి సంతోష్‌కుమార్, సలహాదారు ఈవీ శ్రీనివాస్‌రావు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు పీవీ సంజీవరెడ్డి, కోశాధికారి చంద్రగిరి శ్రీధర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు అజయ్‌బాబు, శివప్రసాద్, బాబు, శ్రీనివాస్, దేవదాస్, అరుణ, రాజు, సురేంద్రబాబు, శివప్రసాద్ పాల్గొన్నారు.
భూముల రీసర్వేలో వేగం పెంచాలి
భూముల రీసర్వేను మొదటి విడతలో చేపట్టిన 70 గ్రామాల్లో ఈనెల 30 వరకు పూర్తి చేయాలని కలెక్ట ర్ సూచించారు. భూముల రీసర్వేపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కే ఎస్బీ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీ నివాస్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం పాల్గొన్నారు.


