ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పి స్తున్న అధికారులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. పప్పుధాన్యాలు కంది, శనగ, పప్పుధాన్యాలు, పొద్దు తిరుగుడు, నువ్వులు విక్రయించేందుకు మార్కెటింగ్ సదుపాయాలు లేక నష్టపోతున్నాం.
– గడ్డం లక్ష్మారెడ్డి, రైతు, బండపల్లి
నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవాలి
ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగుచేసుకోవాలి. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఆరుతడి పంటల సాగులో మల్చింగ్, సూక్ష్మ సేద్యం వంటి పరికరాలను వినియోగించుకోవాలి. పంటల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
– అఫ్జల్బేగం, జిల్లా వ్యవసాయాధికారి


