బోయినపల్లి: రెడ్డి సంఘాల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో మండల రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు చల్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈనెల 15న నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురిని సత్కరించారు. కార్యక్రమంలో మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డబ్బు వెంకటరెడ్డి, డబ్బు తిరుపతి రెడ్డి, గుడి శ్రీనివాస్‌రెడ్డి, తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, వన్నెల రమణారెడ్డి, గుడి రవీందర్ రెడ్డి, నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి, సంఘ నాయకులు పాల్గొన్నారు.


